స్నేహాంజలి

  • అప్పుడెప్పుడో ఒకరు, ఒక పత్రికకు నా గురించి వ్రాస్తానంటూ నా గురించి చెప్పమంటే, అప్పుడు నేను నవ్వేసి ఊరుకున్న. ఆ పిమ్మట చాన్నాళ్ళకు, తిరిగి అతడు కలిసి నప్పుడు, తిరిగి అడిగితే, అప్పుడు నా గురించి ఆలోచించాను. నాతో నేను మాట్లాడుకున్నాను. అవే ఈ నా కబురులు...
  • నన్ను నేను చూపించుకొనే ప్రయత్నం ఈ నా కబురులు...
  • సద్భావనంకు సమాధానం ఈ నా కబురులు...
  • నా స్వసంపద ఈ కబురులు ... మీరే ఈ సంపద వారసులు...
  • నా పరిమితులు మేరకు సాగిన ఈ నా కబురులు, నేటికి నా భావ విరులు, రేపటికి నా భావి సిరులు...
  • జీవి అంటే చావు ఉన్నది. కనుక నాకూ చావు ఉంటుంది. అట్టి చావు తర్వాత కూడా, నేను, నా ఉనికి, నా ప్రయోజనం నిలబడాలి, నిలుపుకోవాలి. అందుకు ప్రయత్నంగా, ఈ నా కబురులు అందిస్తున్నాను. చదవండి, చదివించండి. 

మీ 
బివిడి.ప్రసాదరావు

***